![]() |
![]() |

బీబీ స్టేజి మీద అందరూ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక నాగ్ లైన్ లోకి వచ్చి "ఆరోహి ఎలా ఉన్నావ్ ?" అనేసరికి "బాగున్నా సర్ " అంది "బయటికి వెళ్ళాక చాలా మంది నా స్లాంగ్ కి ఫాన్స్ ఇపోయారు" అని చెప్పింది. "అవును నేను కూడా నీ స్లాంగ్ ని మిస్ అవుతున్నా..నాకు నీ స్లాంగ్ అంటే ఇష్టం" అని చెప్పారు నాగ్. నాకు బిగ్ బాస్ చాలా మంచి చేసింది. నాకు పెద్ద ఫామిలీని ఇచ్చింది. చాలామంది నాతో బాగా క్లోజ్ అయ్యారు.
చెప్పాలంటే బయటికి వచ్చాక వాసంతి నా హజ్బెండ్ ఐపోయింది " అనేసరికి "అవునా అదేంటి ఏ సైడ్ చూసినా వాసంతి అసలు అబ్బాయిలాగే ఉండదు కదా" అన్నారు నాగార్జున. "నేను అబ్బాయిలానే ఉంటా కదా సర్ అందుకే వాసంతికి నేను భర్త అనుకోండి." అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక మన్మధుడు మూవీలో "పూల చెట్టు ఊగినట్టు" అనే లైన్ పాడి నాగార్జునకి డేడికేట్ చేసింది. తర్వాత "వాసంతి ఎలా ఉన్నావ్..బయటికి వెళ్లేసరికి బిజీ ఇపోయావ్" అన్నారు నాగ్. "అవును సర్ నిజమే .కానీ నేను బిగ్ బాస్ ని అస్సలు మిస్ అవ్వలేదు. ఎందుకంటే బీబీ జోడితో మళ్ళీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను" అని చెప్పింది.
![]() |
![]() |